చుండినూకల ఎల్లమ్మ ఆలయంలో దీపావళి పూజలు

*శ్రీ చుండినూకల ఎల్లమ్మ ఆలయంలో దీపావళి పూజలు* వింజమూరు: వింజమూరు గ్రామ పంచాయితీ పరిధిలోని బొమ్మరాజు చెరువు గ్రామంలో దీపావళి పండుగను పురస్కరించుకుని వింజమూరు మాజీ మండలాధ్యక్షురాలు చల్లా. భాగ్యలక్ష్మి-చల్లా.వెంకటేశ్వర్లు యాదవ్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ గ్రామంలో శ్రీ చుండినూకల ఎల్లమ్మ తల్లి అమ్మవారిని చల్లా వంశస్థులు తమ కులదైవంగా భావిస్తుంటారు. ప్రతి యేడాది కూడా అంగరంగ వైభవంగా అమ్మవారికి ఉత్సవాలు జరిపిస్తుంటారు. ఇటీవల ఆలయంలో మహా హోమాలు చేసి విగ్రహ పునహ్ ప్రతిష్ట చేసిన సందర్భంగా మొదటగా వచ్చిన దీపావళిని చల్లా వంశస్థులు కుటుంబ సపరివార సమేతంగా తరలి వచ్చి తమ తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. వేకువజామున అర్చకులు ఆలయ శుద్ధి చేసిన అనంతరం అమ్మవారి మూల విరాట్ ను ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేసిన అనంతరం భక్తులకు తీర్ధ ప్రసాదాలు అందజేశారు. ఈ పూజా కార్యక్రమాలలో చల్లా.యానాదయ్య, చల్లా.మాల్యాద్రి, చల్లా.శ్రీనివాసులు, చల్లా.కౌశిక్, చల్లా.క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.